Thursday, May 17, 2012

అమ్మ ఒక అంతరజ్యోతి

అమ్మ  ఎంత తీయనిదీ పదం. ఆత్మీయతకు మారు పేరు అమ్మ. అనురాగానికి ప్రతి బింబం అమ్మ. అమ్మకు అమ్మనయితే గాని అమ్మ ఋణం తీర్చుకోలేనిది. మా అమ్మ సూర్య కాంతమ్మ .సినిమాలో సూర్యకాంతం  పైకి ఎంత కోపం నటిస్తుందో అంతకన్నా పదింతలు వెన్నలాంటి మనసున్న మా అమ్మ . మా అక్కలిద్దరికి బాల్య వివాహాల వల్ల కలిగిన కష్టాలతో అంతులేని దుఖం కలిగిన అమ్మ   నన్ను కనీసం ఆంద్ర  మేత్రికులేషణ్  పరీక్ష అయినా రాయించాలని తహ తహ లాడింది . స్చూలుకే వెళ్ళని పరిస్థితులలో ఆమాత్రం చదివితే నయమని, ఐదో క్లాసు వరకే చదివి , పదేళ్ళకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన మా అమ్మ. అమ్మతోపాటు  నాన్న కూడా ఇచ్చిన ప్రోత్సాహం తో పన్నెందేల్లకే మెట్రిక్ పాసయ్యాను . అప్పటినుంచి డిగ్రీ దాక పూర్తి చేయించారు 18 సంవస్చరాలకు ఊరిలో బి ఇది ట్రైనింగ్ లో చేర్చాక అమ్మకు భయం వేసింది అమ్మో పెళ్ళిచేయాలని , ఎందుకంటే ఆమెకు అప్పదికే గుండె జబ్బుతో ఎలా ఉంటానో అని, నాన్న చేయగలరో లేదో అని భయంతో ట్రైనింగ్ అవుతుండగానే పెళ్లి చేసిన అమ్మ ఏడాది తిరగకుండానే చనిపోయింది. 55  ఏళ్ళు వచేదాక పిల్లలు, మనుమలతో కలిసి చదువుకుని పీ హెచ్. డి.  చేసి ప్రొఫెసర్ గా రిటైరైన నేను అమ్మ స్పూర్తి తో నాకున్న ఒక్క కూతురితో పాటు ఎ ఆడపిల్ల కనపడిన చదువుకొమ్మని చెప్పుతూ వేలాదిమందిని చదివించ గలిగిన నాకు అమ్మే అంతర్జ్యోతి. అల్లాగే నా మమత కూడా అంతం లేకుండా సంపాదించిన  , సంపాదిన్చుతూ ఉన్న డిగ్రీలు ,నేను ఆమెలో కలిగించ  గల్గిన  అమ్మ స్ఫూర్తి కి తార్కాణం. అంతేకాదు ఈనాడు మమత వేలాదిగా  బాల్య వివాహాలు ఆపుతున్నపుడు, బాలికల ఉన్నతికి ఎంతో శ్రమ పడుతున్నపుడు , నాకు కలిగే తృప్తి, ఆనందం  మాటలలో చెప్పలేను. మా అమ్మ రగిల్చిన ఆ జ్యోతి కలకాలం అమ్మలందరిలో వెలిగి , ప్రతి బాలిక చదువుకుని, తన పిల్లలతోపాటు  ,  పదిమంది బాలికలు చదువుకుని , విద్యావంతులైనాకే  వివాహం చేసుకునేలాగు ప్రయత్నం చేయగల్గితే నాజన్మ ధన్య మైనట్లే.    

No comments:

Post a Comment